News

దయాకరరావు ఎన్నటికి మంత్రి కాలేడు


ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు ఎన్నటికి మంత్రి కాలేడని తెలంగాణ వ్యాఖ్యానించారు. తనను పదవి నుంచి తప్పుకోవాలని, లేదా తనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్న ఎర్రబెల్లి కి సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. తాను పదవి నుంచి తప్పుకుంటే టిఆర్ఎస్ లో చేరి ఆయన మంత్రి కావాలని కలలు కంటున్నాడని అది జరిగే పని కాదని కడియం అన్నారు. తెలంగాణ టిడిపి నేతలు ఏదో ఒక అర్దం లేని వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడానికి యత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గానికి పది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.